ముంబైలో నెలకు రూ.15 లక్షల అద్దెతో కోహ్లీ దంపతుల కొత్త ఫ్లాట్

13-03-2018 Tue 12:37 | Entertainment
  • వోర్లీలోని రహేజా లెజండ్స్ అపార్ట్‌మెంట్‌లో కొత్త ఫ్లాట్‌కు అగ్రిమెంట్
  • ఇందులో రెండేళ్లు మాత్రమే ఉండేలా తాత్కాలిక ఏర్పాటు
  • ఫ్లాట్‌కు నెలకు రూ.15 లక్షల అద్దె చెల్లింపు...!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జంట ముంబైలోని వోర్లీలో ఇటీవల అద్దె ప్రాతిపదికన ఓ ఫ్లాట్‌ను లీజుకు తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ ప్రేమజంట అందులోకి షిఫ్ట్ కానున్నట్లు సమాచారం. ఈ ఇల్లు తాత్కాలికమైన ఏర్పాటేనని, ఇందులో వారు రెండేళ్ల పాటు మాత్రమే ఉంటారని తెలిసింది. 'రహేజా లెజండ్స్' అపార్ట్‌మెంట్‌లోని 40వ అంతస్థులో ఓ ఫ్లాటును విరాట్ లీజుకు తీసుకున్న ఈ ఫ్లాటు విస్తీర్ణం 2675 చదరపు అడుగులు. ఈ ఫ్లాటుకు నెలకు అద్దె కింద కోహ్లీ జంట కళ్లుచెదిరిపోయే మొత్తాన్ని చెల్లించనున్నారు. నెలకు రూ.15 లక్షల అద్దెను వారు చెల్లించనున్నట్లు తెలిసింది.కోహ్లీ ఈ ఫ్లాట్‌కి డిపాజిట్ కింద రూ.1.5 కోట్లను, ఒప్పంద రిజిస్ట్రేషన్ కోసం స్టాంపు డ్యూటీ కింద మరో రూ.1.01 లక్షలు చెల్లించినట్లు తెలిసింది.

కాగా, అక్టోబరు, 2016లో వోర్లీలో 'ఓంకార్ 1973' అపార్ట్‌మెంట్‌లోని 35వ అంతస్థులో ఓ ఫ్లాట్‌ను విరాట్ రూ.34 కోట్లకు కొనుగోలు చేశాడు. దీని విస్తీర్ణం 7,171 చదరపు అడుగులు. ఇది 5-బీహెచ్‌కే లగ్జరీ హోమ్. మరో విశేషమేమిటంటే...ఇదే అపార్ట్‌మెంట్‌లోని 29వ అంతస్థులో ఉన్న ఓ ఫ్లాట్‌ను క్రికెటర్ యువరాజ్ సింగ్-హజీల్ కీచ్ దంపతులు కొనుగోలు చేశారు. కాగా, డిసెంబరు 11, 2017న తమ కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య విరాట్-అనుష్క జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.
Virat KohliAnushka SharmaMumbaiWorliRaheja Legends

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more